అత్తి పండ్లతో మగవారికి కావలసిన శక్తి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెపుతారు. అత్తి పండ్లు గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అత్తి పండ్లలో ఉండే ఫైబర్ అనేక రకాల కేన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పెద్దప్రేగు కేన్సర్ నివారించడంలో సహాయపడతాయి. అత్తి పండు ఆకుల రసంను అల్పాహారంగా తీసుకుంటే షుగర్ అదుపులో వుంటుంది. మూత్రపిండ సంబంధిత వ్యాధి లేదా పిత్తాశయం సమస్యతో బాధపడేవారు అత్తి పండ్లను తినకూడదు.