AP ECET ఫార్మసీ తుది విడత కౌన్సెలింగ్ సెప్టెంబర్ 25వ తేదీ నుంచి జరగనుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 25, 26వ తేదీల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు ప్రక్రియ కొనసాగుతుంది. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, కోర్సులు, కాలేజీల ఎంపికకు వెబ్ ఆప్షన్ల నమోదు ఉండనుంది. సెప్టెంబర్ 27వ తేదీ వెబ్ ఆప్షన్ల సవరణ, 28న సీట్ల కేటాయింపు ఉండనుంది.