సోమాలియాలోని బెలెడ్ వెయిన్ నగరంలో పేలుడు పదార్థాలతో ఉన్న వాహనం పేలిన ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం మధ్యాహ్నం ఓ చెక్ పోస్ట్ వద్దకు బాంబులతో ఉన్న వెహికల్ దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో మరో 40 మంది గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించగా 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. కాగా, ఈ పేలుడుపై ఇంకా ఏ సంస్థ ప్రకటన చేయలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa