బ్రిటన్ లో ఓ అరుదైన వ్యాధి శునకాల నుంచి మనుషులకు సోకింది. ఇప్పటికే ముగ్గురు ఈ వ్యాధి బారిన పడ్డారు. ‘బ్రుసెల్లా కెనిస్’గా పిలుచుకునే ఈ వ్యాధి సాధారణంగా కుక్కలకు వస్తుంది. బ్యాక్టీరియా కారణంగా సోకే ఈ వ్యాధి మనుషుల్లోనూ బయటపడడం కలకలం రేపింది. శునకాల స్రవాల ద్వారా మనుషులకు సోకి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యాధికి వ్యాక్సిన్ లేకపోవడంతో ఆందోళన కలిగిస్తోంది.