ఎక్కువగా తేమ గల వేడి ప్రదేశాలలో సాగు తమలపాకు పంటకు సరైన సమయంలో ఎరువులు అందిస్తే మంచి రాబడులు పొందవచ్చు. తీగ నాటే ముందు దుక్కిలో ఎకరానికి 40 కిలోల భాస్వరం, 40 కిలోల పొటాష్ కలిపి వేయాలి. నాటు తర్వాత రెండు నెలల నుండి ఎకరాకు 80 కిలోల నత్రజని వేప పిండి, యూరియా 1:1 నిష్పత్తిలో సంవత్సరానికి నాలుగు నుండి ఆరు దఫాలుగా పిచికారి చేయాలి. ఎకరాకు ఒక టన్ను చొప్పున జిప్సం వేయాలి.