ఆహారాన్ని మెల్లమెల్లగా తినాలి. ఒకేసారి పెద్ద మొత్తంలో తినకూడదు. తక్కువ తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినడం మంచిది. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు, బాగా వేయించిన పదార్థాలు తగ్గించాలి. పొగ తాగడం, మద్యం అలవాట్లను మానేయాలి. రోజూ కనీసం రెండు లీటర్ల కంటే ఎక్కువగా మంచినీరు తాగాలి. కూల్‌డ్రింక్స్, సోడాలు, కార్బొనేటెడ్ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. పాలు, పాల ఉత్పాదనలను వీలైనంత వరకు తగ్గించాలి.