ముల్లంగిని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. అయితే దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముల్లంగిలో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి. అలాగే అధిక బరువు కూడా తగ్గుతారు. ముల్లంగిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగానే ఉంటాయి. అందువల్ల మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గుండె సమస్యలు ఉన్నవారు నిత్యం ముల్లంగి తింటే ఎంతో మంచిది.