రాత్రి పూట తిన్న వెంటనే పడుకోవడం వల్ల చాలా దుష్పరిణామాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఆహారం తిన్న వెంటనే నిద్రపోతే రక్తంలో ఎక్కువ చక్కెర కరిగిపోతుంది. దీనివల్ల మధుమేహానికి గురయ్యే ప్రమాదం చాలా ఎక్కువ. ఆహారం తిన్న వెంటనే నిద్రపోతే కడుపులో ఆహారం పేరుకుపోయి జీర్ణక్రియ మందగిస్తుంది. జీవక్రియ కూడా బలహీనంగా మారుతుంది. అలాగే అసిడిటీ, బర్నింగ్‌కు కారణమవుతుంది. శరీర బరువు కూడా భారీగా పెరుగుతుంది.