స్మార్ట్ ఫోన్ ఎప్పుడూ 100 శాతం ఛార్జింగ్ చేయకూడదని నిపుణులు పేర్కొంటున్నారు. ఏ ఫోన్ బ్యాటరీ అయినా 30 నుంచి 50 శాతం ఉన్నప్పుడు లిథియం బ్యాటరీ ఉత్తమంగా పని చేస్తుందంటున్నారు. చాలామంది బెడ్ పై ఉన్నప్పుడు తమ ఫోన్ ఛార్జ్ చేస్తారని, అలా చేస్తే ఫోన్ వేడెక్కి ప్రమాదం జరిగే ఆస్కారముందంటున్నారు. ఛార్జింగ్ పెట్టినప్పుడల్లా 20 నుంచి 80 శాతం వరకు మాత్రమే ఉండేలా చూసుకోవాలి. రాత్రిపూట ఛార్జ్ పెట్టి మర్చిపోకూడదు.