ఇటీవలి కాలంలో బాగా పెరిగిన సమస్య నిద్రలేమి. దీంతో ఇబ్బందిపడే వారికి నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు. పడుకోవడానికి కనీసం 2 గంటల ముందే భోజనం పూర్తి చేసేస్తే హాయిగా నిద్ర పడుతుంది. ఇక బాదంపాలు తాగినా, చెర్రీ పండ్లు తిన్నా నిద్ర ముంచుకొస్తుందట. పసుపు పాలు తాగితే నిద్ర మాత్రమే కాక రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆరోగ్య వంతమైన జీవనం కోసం రోజూ 7గంటలు నిద్ర పోవాలంటున్నారు వైద్యులు.