ప్లాస్టిక్ కప్పుల్లో ప్రతీ రోజు పానీయాలు తాగితే మాత్రం అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే అని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. చాలా వేడిగా చాయ్ తాగితే అలవాటున్నట్టైంతే వెంటనే దాన్ని మానుకోండి. త్రోట్ క్యాన్సర్ మాత్రమే కాదు ఎసిడిఫికేషన్, అల్సర్ వంటి కడుపు సంబంధిత సమస్యలు వేధిస్తాయి. రోజుకు 3 లేదా 4 సార్లు పేపర్ లేదా ప్లాస్టిక్ కప్లో టీ తాగితే అతి సూక్ష్మమైన 75,000 టైనీ ప్లాస్టిక్ పార్టికల్స్ ఒంట్లోకి చేరినట్టే. బయట టీ కొట్లో టీ తాగేవారు ఇది గుర్తుంచుకోవాటని నిపుణులు సూచిస్తున్నారు. మంచి పోషకాలున్న డ్రై ఫ్రూట్స్, కూరగాయలు తినటం ఆరోగ్యానికి చాలా మంచిదని తెలిపారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీ శరీరంపై ప్లాస్టిక్ కప్పులు తీవ్ర స్థాయిలో సైడ్ ఎఫెక్ట్ కలిగిస్తాయని చెబుతున్నారు. త్వరగా అనారోగ్యానికి గురి చేస్తాయని చెబుతున్నారు. ఈ ముప్పు రెండు విధాలుగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చెమోస్ఫియర్ జర్నల్‌లో ఇటీవల ఒక అధ్యయనాన్ని ప్రచురించారు. ఒక కప్పుకు 3 మిల్లీగ్రాములు మైక్రో ప్లాస్టిక్ కణాలు శరీరంలోకి వెళ్తాయని, తద్వారా అనారోగ్యానికి గురవుతారని పేర్కొంది. మైక్రోప్లాస్టిక్స్ తీసుకోవడం ద్వారా మీ రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.
ప్లాస్టిక్‌లో బీపీఏ కంటెంట్ అధికంగా ఉంటుందని, అలాంటి కప్పుల తాగడం వల్ల మన రోగనిరోధక శక్తి తగ్గే ముప్పు పెరుగుతుందని అంటున్నారు. ప్లాస్టిక్ కప్పులు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ కప్పులపై తరచుగా సూక్ష్మక్రిములు తిష్టవేసి ఉంటాయని, నోటి లాలాజలాల ద్వారా లోపలికి వెళ్లిపోతాయని అంటున్నారు. రోజులో ఈ కప్పులను అధికంగా వాడటం ద్వారా బ్యాక్టీరియా పెరుగుదలకు దారితీస్తుందని, తద్వారా మీరు అనారోగ్యానికి గురవుతారని హెచ్చరిస్తున్నారు. అందుకే ప్లాస్టిక్ కప్ ల బదులుగా ఏదైనా పానీయాలను గాజు గ్లాసులో తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు.