ఇటీవల ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న రవికుమార్ (42) అనే వ్యక్తి మరణించాడని పోలీసులు తెలిపారు. మండలంలోని శెట్టివారిపల్లె గ్రామానికి చెందిన రవికుమార్ ఈ నెల 13న బైక్ పై జమ్మలమడుగు సమీపంలోని కొట్టాలపల్లెకు వెళ్లి అదే రోజు రాత్రి ఇంటికి తిరిగి వస్తున్నాడు. ముద్దనూరు శివారులోని శివాలయం వద్ద బైక్ అదుపుతప్పి పడడంతో రవికుమార్ తలకు తీవ్ర గాయమైంది. కర్నూలులో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడన్నారు.