చేతివృత్తుల వారికి సంక్షేమ పథకాలు రద్దు చేసి చేదోడుతో చిల్లరిస్తూ దగా చేయడమే సీఎం జగన్ నైజమని టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంధ్ర విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. బీసీలను అణగదొక్కి చేదోడుతో చిల్లర విదిల్చడమే తోడుగా నిలవడమా? అని ప్రశ్నించారు. చేతివృత్తుల వారికి గతంలో అందే పథకాలన్నీ రద్దు చేశారని, సబ్సిడీలు, స్వయం ఉపాధి రుణాలు రద్దు చేశారని, కార్పొరేషన్లను నిర్వీర్యం చేయడం బీసీలను ఉద్దరించడమా? అని నిలదీశారు.