శీతాకాలపు వాతావరణ ప్రభావం చర్మంపై ఎక్కువగా పడుతుంది. ఈ కాలంలో చర్మం పగుళ్లు , పొడిబారటం, దురదలు వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించటం మంచిది. ఎక్కువ నీటిని సేవించాలి. ఆహారంలో పండ్లు, పండ్ల రసాలు చేర్చుకోవాలి. చర్మానికి పోషకాలు అందించే ఫేస్ మాస్క్ ఉపయోగించాలి. కొబ్బరి నూనెను స్నానం చేసిన వెంటనే చర్మానికి రాసుకోవాలి. బయటకు వెళ్ళేప్పుడు వెచ్చదనాన్ని ఇచ్చే దుస్తులు ధరించాలి.