ఛత్తీస్గఢ్లో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సోమవారం రూ.175 కోట్ల మేర రైస్ మిల్లింగ్ స్కామ్ జరిగిందని ఈడీ ఆరోపించింది. మార్క్ఫెడ్ మాజీ ఎండీ మనోజ్ సోనీ, రైస్ మిల్లర్స్ ట్రెజరర్ రోషన్ చంద్రశేఖర్ ఆఫీస్ బ్యారర్లు, ఇళ్లల్లో 20, 21 తేదీల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. పలు పత్రాలు, డిజిటల్ పరికరాలను, లెక్కలు చూపని రూ.1.06 కోట్ల నగదును స్వాధీనం చేసుకొన్నట్టు ఈడీ పేర్కొన్నారు.