కళ్ల చుట్టూ నల్లటి వలయాలతో చాలా మంది అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు. దీనికి నిద్రలేమి, ఒత్తిడి, కోపం, కంప్యూటర్-టీవీ-మొబైల్ ఫోన్ల మీద ఎక్కువ సమయం గడపడం, విపరీతమైన పని భారం, డీహైడ్రేషన్, రక్తహీనత మొదలైనవి ప్రధాన కారణాలు. అయితే.. టొమాటోలు, దోసకాయ, బొప్పాయి, బచ్చలికూర, బీట్‌రూట్, పుచ్చకాయ, బ్లూబెర్రీస్, ఆరెంజ్ వంటి ఆహార పదార్థాలు తినడం ద్వారా వీటికి చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.