ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఇరిగేషన్ శాఖ మంత్రి మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. ప్రాజెక్టులో దిగువ కాఫర్ డ్యాం వద్ద జరుగుతున్న డీ వాటరింగ్ పనులను స్వయంగా పరిశీలించి.. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య ఉన్న సీ ఫేజ్ నీటి మళ్లింపు పనులను సైతం మంత్రి అంబటి పరిశీలించారు.