గర్భధారణ సమయంలో జీలకర్ర నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలంగా మారుతుంది. జీలకర్రలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజూ జీలకర్ర నీటిని తాగడం ప్రారంభిస్తే.. రోగనిరోధక శక్తి చాలా బలంగా మారుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తాగితే.. వారి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. జీలకర్ర శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. ప్రతిరోజూ జీలకర్ర నీటిని తాగడం ప్రారంభిస్తే.. రక్తపోటు ఎల్లప్పుడూ అదుపులో ఉంటుంది.