వేరుశనగలు ఆరోగ్యానికి ఎంత మంచివో అంతే అనర్థం కూడా. వీటిని అతిగా తినడం వల్ల ఇనుము, మాంగనీస్, జింక్, కాల్షియం వంటి ఇతర ఖనిజాలు శోషణకు ఆటంకం కలిగిస్తాయి. అలాగే ఇవి బరువు తగ్గడానికి ఆటంకం కలిగిస్తాయి. జీర్ణ సమస్యలకు దారితీస్తాయి. ముఖ్యంగా అలెర్జీ సమస్య ఉన్నవాళ్లు వీటిని తినకపోవడం మంచిది. ఒకవేళ తింటే గొంతు నొప్పి, చర్మ సమస్యలు, ముక్కు కారడం, జీర్ణ సమస్యలు, శ్వాస అడకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.