పిల్లల ఆరోగ్యం కోసం తల్లిదండ్రులు ప్రతిరోజూ పాలు తాగిస్తారు. అయితే, కొందరు పిల్లలు పాలు తాగడానికి ఇష్టపడరు. అలాంటి వారికి రుచిగా ఉండేలా కొన్నింటిని తినిపిస్తారు. అయితే, పాలతో ఈ పదార్థాలు అస్సలు తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. సిట్రస్ పండ్లు, అరటి పండ్లు పాలతో కలిపి ఇవ్వకూడదని సూచిస్తున్నారు. దీని వల్ల కడుపు నొప్పి, గొంతునొప్పి, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయంటున్నారు. అలాగే పాలతో ద్రాక్షను అస్సలు ఇవ్వకూడదని పేర్కొంటున్నారు.