ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్రభుత్వాలు ప్రోత్సహించడం, ప్రజలు కూడా ఇ-వెహికిల్స్ వాడడానికి ఆసక్తి చూపిస్తుండడంతో ఈ రంగం వేగంగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ టాటా మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కారును తీసుకొస్తోంది. బ్రిటీష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థతో పాటు టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మధ్య కుదిరిన ఒప్పందంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఎలక్ట్రిఫైడ్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫారమ్ కొత్త ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనుంది. టాటా అవిన్య పేరుతో ఈ కారును రూపొందిస్తున్నట్లు టాటా అధికారికంగా ప్రకటించింది.