బెల్లం తినడం వల్ల గ్యాస్ ఉబ్బరం పూర్తిగా తగ్గిపోతుంది. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. రక్తాన్ని శుద్ధి చేసి మెటబాలిజంని క్రమబద్దీకరణ చేస్తుంది. రక్తంలోని ప్రమాదకరమైన టాక్సిన్లను దూరం చేస్తుంది. చర్మానికి మంచి మెరుపు నిచ్చి మొటిమలను నివారిస్తుంది. జలుబు, దగ్గు, రొంపలాంటి వాటికి ఉపశమనం ఇస్తుంది. బెల్లం శరీర ఉష్ణోగ్రతని నియంత్రణలో ఉంచుతుంది. బెల్లంతో కొద్దిగా అల్లం కలిపి తీసుకుంటే మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి.