సమ్మర్ సీజన్ లో మామిడి తో పాటు నేరేడు పండ్లు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. వీటిలో ఎన్నో పోషకాలు ఉండటంతో వీటిని తినడానికి ఇష్ట పడతారు. నేరేడు పండ్ల పంట వేయడం ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుందని రైతులు చెప్పుతున్నారు. నేరేడు సాగు చేసే విధానం ఇదే.ఎరువులు, పురుగు మందుల నిర్వహణలో మెరుగైన మెళకువలు నేర్చుకుని లాభాలు పొందొచ్చు. పుష్పించే దశ నుంచి ఫలాలు వచ్చే దశ వరకు, ఉత్తమ నిర్వహణ పద్ధతులు అనుసరించడం ద్వారా మరింత దిగుబడి పొందుతామని వ్యవసాయ నిపుణులు తెలిపారు.