నారింజ పండ్లను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ పండ్లలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి, అమినో యాసిడ్స్, కాల్షియం, అయోడిన్, ఫాస్పరస్, సోడియం, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. రోజూ నారింజ పండ్లను తినే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు లాంటి సమస్యలు ఉండవు. మీ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.