పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడంటూ బాధితురాలు మంగళవారం కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళగిరికి చెందిన మహిళ నర్సింగ్ శిక్షణ కోసం 2018 గుంటూరుకు వచ్చింది. నకరికల్లుకు చెందిన వెంకటేష్ శిక్షణకు వచ్చాడు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడగా గుంటూరు తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడని ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే నిరాకరిస్తున్నాడని ఫిర్యాదు చేసింది.