నరసరావుపేటకి చెందిన మల్లెల యోహానుపై స్థలం విషయంలో అదేప్రాంతానికి చెందిన నెహేమియా దాడిచేసి గాయపరిచాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నెహేమియాకు చెందిన స్థలాన్ని గతంలో యోహాను కొన్నాడు. నెహేమియా తన స్థలాన్ని తనకు అప్పజెప్పాలని, ఇచ్చిన నగదు తిరిగి ఇవ్వాలన్నాడు. ఈ విషయంలో ఇద్దరిమధ్య తలెత్తిన వివాదంలో నెహేమియా దాడికి పాల్పడి గాయపరిచాడు. మంగళవారం యోహాన్ ఫిర్యాదు మేరకు 2వ పట్టణ పోలీసులు కేసునమోదు చేశారు.