ఉలవల్లో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. ఉలవలు శరీరానికి తక్షణ శక్తినిస్తాయి. పోషకాహార లోపంతో బాధపడేవారు ఉలవలు తింటే ప్రయోజనం ఉంటుంది. ఉలవల్లో కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పీచు లభిస్తాయి. ఉలవలను ఆహారంలో భాగం చేసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. రుతుక్రమ సమస్యలతో బాధపడే మహిళలు కూడా ఉలవలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఉలవలు చర్మాన్ని, జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి.