గంధం సువాసనతో మనస్సు ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదంగా మారుతుంది. గంధాన్ని రాసుకోవడం వల్ల చర్మం ముడతలు పడకుండా రక్షిస్తుంది. చర్మంలో పేరుకున్న మలినాలు తొలగించి మృదువుగా మారుస్తుంది. అలాగే గంధంలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. తలనొప్పి, జ్వరం, కంటి సమస్యలతో పాటు తేలు విషానికి విరుగుడుగా గంధాన్ని ఉపయోగిస్తారని చెబుతున్నారు.