యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం అద్దాల మండపంలో ఊంజల్ సేవ కోలాహలంగా నిర్వహించారు. అమ్మవారికి జరిగే ఈ వేడుకల్లో మహిళా భక్తులు పాల్గొని తరించారు. ఆలయ ముఖ మండపంలో మొదటగా శ్రీమన్యు సూక్త పారాయణం జరిపి, ప్రత్యేకంగా కుంకుమార్చన, సువర్ణ పుష్పార్చన జరిపి సాయంత్రం అమ్మవారిని తిరువీధుల గుండా ఊరేగించి, మంగళ నిరాజనాలు సమర్పించారు. భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa