పసుపు మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్ ఆరోగ్యానికి మంచింది. అయితే మితిమీరిన పసుపు ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. పసుపు ఎక్కువగా తినడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. 450 మిల్లి గ్రాముల పసుపు శరీరంలోకి చేరితే తల నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గర్భిణులు పసుపు ఎక్కువగా తినకూడదు. పసుపు గర్భాశయ సంకోచాలను ప్రేరేపిస్తుంది.