పని ఒత్తిడితో ఆఫీసుల నుంచి ఇంటికి వచ్చే వారికి అంతగా నిద్ర పట్టదు. రోజూ రాత్రి పడుకునే ముందు 10 నిమిషాలు ఏదైనా చదివితే ఒత్తిడి తగ్గి రిలాక్స్‌గా ఉంటుంది. అలాగే ఆహ్లాదకరమైన సంగీతాన్ని వింటుంటే మనసు హాయిగా ఉండి చక్కగా నిద్రపోతుంది. 5 నిమిషాలు లోతైన శ్వాస తీసుకోవడం, యోగా చేయడం వల్ల మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. దీంతో గుండె కొట్టుకునే వేగం తగ్గి టెన్షన్ లేకుండా నిద్రపోతుంది. ఒకసారి ప్రయత్నించండి.