పచ్చిమిర్చిని మనం ప్రతి రోజు కూరల్లో చేర్చుకుంటే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పచ్చిమిర్చి లో బీటా కెరోటిన్, కాప్సైసిన్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి మన శరీరానికి హాని చేసే ఫ్రీరాడికల్స్‌ను న్యూట్రలైజ్ చేయడంలో సాయపడతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడే ప్రమాదం నుంచి రక్షిస్తాయి. మిర్చిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి మొటిమలు, మచ్చలు నివారించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని కొన్ని పరిశోధనల్లో తేలింది.