పచ్చి కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పచ్చికొబ్బరి యాంటీ బయోటిక్‌గా కూడా పనిచేస్తుంది. రోగ నిరోధకశక్తిని కూడా బాగా పెంచుతుందని, చర్మ, జుట్టు సమస్యలకు కూడా బాగా ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు.
పచ్చికొబ్బరి తినడం వల్ల శరీరంలోని వైరస్, బ్యాక్టీరియాలతో శక్తివంతంగా పోరాడుతుందని, ఇన్‌ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం కూడా చాలా వరకు ఉండదని వైద్యులు అంటున్నారు. గుండెకూడా ఎంతో ఆరోగ్యంగా పనిచేస్తుందని చెబుతున్నారు. పచ్చికొబ్బరి తినడం వల్ల థైరాయిడ్ సమస్య కూడా తగ్గిపోతుందని వైద్య నిపుణులు అంటున్నారు.