వాకాడు మండలం కల్లూరు గ్రామంలో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన జగనే ఆంధ్రప్రదేశ్ కు ఎందుకు కావాలంటే కార్యక్రమానికి గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ రావు, ఎమ్మెల్సీ, శాసన మండలివీప్ ఎం. మురళీధర్, వాకాడు మండలంలోని వైకాపా నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. వంద శాతం మేనిఫెస్టోను అమలు చేసిన ఏకైక పార్టీగా వైసీపీ చరిత్ర సృష్టించిందన్నారు.