తాము అడిగిన వివరాలు ఇవ్వకపోతే సిమ్‌కార్డు కనెక్షన్ రద్దు చేస్తామని బెదిరిస్తూ మోసగాళ్లు చేసే కాల్స్, సంక్షిప్త సందేశాల (ఎస్‌ఎంఎస్)ను నమ్మొద్దని ప్రజలకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ విజ్ఞప్తి చేసింది. చట్టవిరుద్దమైన అలాంటి కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు ట్రాయ్ నుంచి రావని గుర్తించాలని పేర్కొంది. టెలికాం చందాదారుల కనెక్షన్‌ను రద్దు చేయడం లేదా స్తంభింపచేయడం లాంటి పనులను ట్రాయ్ చేపట్టదని స్పష్టం చేసింది.