పీజీ విద్యార్థులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచంలో మార్పులకనుగుణంగా ఏడాది కాలవ్యవధితో కూడిన మాస్టర్స్ డిగ్రీ (పీజీ) కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. కొత్త సబ్జెక్ట్ తో ఏడాది పీజీ కోర్సు తీసుకువస్తున్నట్లు పేర్కొంది. దీనిపై అభిప్రాయాలను తీసుకుంటున్నట్లు తెలిపింది. 4 ఏళ్ల యూజీ లేదా 3 ఏళ్ల యూజీతో పాటు 2 ఏళ్ల మాస్టర్స్ చదివినవారు ఈ కోర్సు కు అర్హులని తెలిపింది.