వచ్చే ఐదేళ్లలో 3,000 కొత్త రైళ్లను తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రస్తుతం ఏటా 800 కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారని, ఈ సామర్థ్యాన్ని 1000 కోట్లకు పెంచేందుకు కొత్త రైళ్లను అందజేస్తామని మీడియా సమక్షంలో తెలిపారు. ప్రస్తుతం రైల్వేలో 69,000 కొత్త కోచ్‌లు అందుబాటులో ఉన్నాయి. కొత్త రైళ్లను సిద్ధం చేయడంతోపాటు రైల్వే వ్యవస్థను మెరుగుపరుస్తామని వైష్ణవ్ తెలిపారు.