దేశ రాజధాని ఢిల్లీలో గురువారం గాలి నాణ్యత రోజు రోజుకి పెరుగుతుందని పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. గాలి వేగం తగ్గడం వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులతోపాటు వాహన కాలుష్యం పెరగడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఢిల్లీలో 24 గంటల సగటు గాలి నాణ్యత సూచిక ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలకు నమోదవుతుంది. బుధవారం 401గా ఉన్న గాలి నాణ్యత గురువారం నాటికి 419కి పడిపోయింది. అత్యంత ప్రమాదకర స్థాయికి (450) దగ్గరగా ఉందన్నారు.