దేవతారాధన సమయంలో దీపం వెలిగించడం వల్ల జీవితంలోని చీకట్లు తొలగిపోవడమే కాకుండా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది. శాస్త్రాల ప్రకారం, దీపం వెలిగించడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి. దీపం అంటే జ్ఞానం. దీపం మన జ్ఞానాన్ని వెలిగించి మనలోని చెడు అనే చీకట్లను పారదోలుతుంది. పవిత్రంగా పైకి ఎగసే ఆ జ్ఞానపు వెలుగులను స్ఫూర్తిగా తీసుకుని మనం కూడాఉన్నత శిఖరాలను అందుకోవాలన్నదే దీప పరమార్థం.