వాట్సప్‌లో కొత్తగా ఇ-మెయిల్ వెరిఫికేషన్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా యూజర్లు తమ ఇ-మెయిల్ ఐడీని తమ అకౌంట్‌కు జోడించొచ్చు. ఎప్పుడైనా యాప్ లాగిన్ సమయంలో ఎస్సెమ్మెస్ రాక ఇబ్బంది పడకుండా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. సెల్యులర్ నెట్‌వర్క్ అందుబాటులో లేనప్పుడు ఈ ఫీచర్ పనికొస్తుంది. ప్రస్తుతానికి ఐఓఎస్ యూజర్లకు ఈ ఫీచర్‌ను తీసుకురాగా.. త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకూ అందుబాటులోకి రానుంది.