కంప్యూటర్లు, టీవీలు, సెల్‌ఫోన్ల మితిమీరిన వినియోగంతో విషయగ్రహణ సామర్థ్యానికి సంబంధించిన అనేక సమస్యలు రావొచ్చని తాజా అధ్యయనం పేర్కొంది. ఏకాగ్రత, ప్రణాళిక రచన, సమస్యను పరిష్కరించే సామర్థ్యం వంటివి దెబ్బతింటున్నట్లు పరిశోధకులు తెలిపారు. వీడియో గేమ్స్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, సామాజిక మాధ్యమాలు లేదా స్మార్ట్ ఫోన్లను మితిమీరి వాడేవారిపై చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.