ఏపీలోని వర్సిటీల్లో 3,220 ఉద్యోగాల భర్తీలో దరఖాస్తుల స్వీకరణ తర్వాతి ప్రక్రియను ఆపేయాలని వీసీలను ఉన్నత విద్యాశాఖ ఆదేశించింది. పోస్టులకు రిజర్వేషన్ రోస్టర్ సరిగా లేదంటూ ఇటీవల పలువురు హైకోర్టుకు వెళ్లారు. దీంతో విచారణ పూర్తయ్యే వరకు నియామక ప్రక్రియలో ముందుకెళ్లొద్దని ఉన్నత కోర్టు స్పష్టం చేసింది. పలు వర్సిటీలు తమ ఆదేశాలను బేఖాతరు చేయడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.