మైగ్రేన్ తో ఇబ్బంది పడుతున్నవారు తగు జాగ్రత్తలు తీసుకుంటే కాస్త అదుపులో ఉంచొచ్చని వైద్యులు తెలుపుతున్నారు. ఎక్కువగా శబ్ధాలు వినకపోవడం, వెలుతురు లేని గదిలో పడుకోవడం. సరైన నిద్ర పోవడం లాంటివి చేయాలి. మద్యం, పొగతాగే అలవాట్లు మానుకోవాలి. రోజూ తగినంత నీరు తాగాలి. జీవనశైలిలో మార్పు చేసుకోవాలి. రోజూ వ్యాయామం చేయాలి. తలనొప్పి ఉన్నప్పుడు మాంసం, పప్పులు తినడం తగ్గించాలి. యోగా చేయాలి. దీర్ఘంగా శ్వాసను తీసుకోవాలి.