ప్రముఖ టెలికాం కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతున్న వొడాఫోన్ ఐడియా తన కస్టమర్లకు శుభవార్త అందించింది. కొత్త రీఛార్జ్ ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. ఇది డేటా రీఛార్జ్ ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా మీరు అదే ప్రయోజనాలను పొందవచ్చు. Vodafone Idea తీసుకొచ్చిన కొత్త రీఛార్జ్ ప్లాన్ ఏమిటి? దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? అలాంటి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలో మూడో అతిపెద్ద టెలికాం కంపెనీగా కొనసాగుతున్న వొడాఫోన్ ఐడియా తాజాగా సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ధర రూ. 23 మాత్రమే. ఈ ప్లాన్‌ల వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రూ. 23 ప్రీపెయిడ్ ప్లాన్ అనేది డేటా వోచర్. ఇది 1.2 GB డేటాతో వస్తుంది. దీని వాలిడిటీ ఒక్క రోజు మాత్రమే. అలాగే, కంపెనీ రూ.19 ధరలో డేటా ప్లాన్‌ను అందిస్తోంది. ఇది ఒక GB డేటాతో వస్తుంది. దీని వ్యాలిడిటీ కూడా ఒక రోజు మాత్రమే. అంటే అదనంగా 200 ఎంబీ డేటా పొందాలనుకునే వారు రూ. 19 కాకుండా ఈ 23 డేటా ప్లాన్‌లను రీఛార్జ్ చేసుకోవచ్చు. Vodafone Idea ప్రకారం, ఈ డేటా ప్లాన్ అర్ధరాత్రి 12 గంటలకు ముగుస్తుంది. అంటే ఉపయోగించని ఏదైనా డేటా పోతుంది. అందుకే డేటాను పూర్తిగా వినియోగించుకోవాలి. అలాగే కంపెనీ వినియోగదారులకు రూ. 24 ధర వద్ద డేటా ప్లాన్‌ను కూడా అందిస్తోంది. దీని ద్వారా మీరు అపరిమిత డేటా ప్రయోజనాన్ని పొందవచ్చు. అయితే దీని వ్యాలిడిటీ ఒక గంట మాత్రమే. అంటే గంటలో ఎంత డేటా లభిస్తుందో.. అంత డేటా వాడుకోవచ్చు. గంట పూర్తయ్యే సరికి ప్లాన్ అయిపోయింది.