ఉల్లిపాయ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే, ప్రతి రోజూ పచ్చి ఉల్లిపాయ తింటే ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్థులకు పచ్చి ఉల్లిపాయ చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు. ఉల్లిపాయ లోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో మంటలు తగ్గిస్తాయి. కడుపులో, ఛాతిలో మంట సమస్య ఉంటే పచ్చి ఉల్లిపాయ తీసుకోవాలంటున్నారు. అలాగే, జీర్ణ సమస్యల నివారణ, ఎముకలు బలోపేతం అయ్యేలా పచ్చి ఉల్లిపాయ చేస్తుంది అని తెలిపారు.