అధికారులు సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా పనిచేయాలని హిందూపురం మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సెక్షన్ లోని రికార్డులను పరిశీలించి పనులు పెండింగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు పూర్తిచేయాలని, లేనిపక్షంలో వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.