గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమం జరగాలంటే టీడీపీతోనే సాధ్యమని కళ్యాణదుర్గం టీడీపీ ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు అన్నారు. బుధవారం కళ్యాణదుర్గం మండలం ఎం. కొండాపురంలో బాబు షూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పతకాలు వివరించారు. ఉమా మాట్లాడుతూ ఈ రోజు ఏ గ్రామంలో చూసిన అభివృద్ధి కళ్లకు కట్టినట్లు కన్పిస్తున్న ఘనత చంద్రబాబు నాయుడి కృషే అన్నారు.