స్విట్జర్లాండ్‌లోని జెనీవా విశ్వవిద్యాలయానికి చెందిన బృందం పరిశోధనలో మొబైల్ ఫోన్‌లను ఎక్కువగా ఉపయోగించే మగ వారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నట్లు తేలింది. 2005 మరియు 2018 మధ్య నియమించబడిన 18 నుంచి 22 సంవత్సరాల వయస్సు గల 2,886 మంది పురుషుల డేటా ఆధారంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. అంతేకాక ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల తలనొప్పి, జుట్టు రాలడం, కళ్లు దెబ్బతినడం లాంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి.