నల్ల మిరియాలతో ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని నల్ల మిరియాలను బాగా మరిగించి వడకట్టాలి. ఆ నీటిని తాగితే రోగ నిరోధక శక్తి పెరగడం సహా, జీర్ణక్రియ మెరుగుపడుతుందంటున్నారు. మల బద్ధకం తగ్గుతుంది. వేడి నీరు, నల్ల మిరియాల మిశ్రమం గట్ ఆరోగ్యానికి మంచిది. ఖాళీ కడుపుతో నల్ల మిరియాల నీటిని తాగితే పేగులు శుభ్రమవుతాయి. శరీరం హైడ్రేట్ అవుతుంది.