చాలా మందికి చిన్న వయసులోనే ఒళ్లు నొప్పులు వస్తుంటాయి. ఏ మాత్రం వాటిని పట్టించుకోకుండా జీవనం సాగిస్తుంటారు. ఈ క్రమంలో కొంత కాలానికి అవి తీవ్రంగా బాధిస్తుంటాయి. అయితే కొన్ని చిట్కాలతో వాటిని దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాత్రి సమయంలో పడుకునే ముందు పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే ఎంతో ప్రయోజనం ఉంటుంది. వేడి నీళ్లలో ఓ టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి, ఆ నీటిని తాగాలి. లేదా స్నానం చేసే నీటిలో దానిని కలుపుకున్నా ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలకు ఒళ్లు నొప్పులు తగ్గించే శక్తి ఉంది. నొప్పిగా ఉన్న చోట ఐస్ ముక్కను పెట్టి కొద్ది సేపు ఉంచినా ఫలితం ఉంటుంది.
ఒక గ్లాసులో నీటిలో అల్లం ముక్క వేసి, వాటిని బాగా మరిగించాలి. ఆ తర్వాత నిమ్మ కాయ రసాన్ని కలుపుకుని తాగితే ఎంతో ప్రయోజనం ఉంటుంది. గోరు వెచ్చని నీటిలో దాల్చిన చెక్క, కొంచెం తేనె కలుపుకుని తాగితే ఒళ్లునొప్పులు దూరం అవుతాయి. ఆవనూనెను కాస్త వేడి చేసి, గోరువెచ్చని నూనెలో లవంగాలు, వెల్లుల్లి వేయాలి. కాసేపు తర్వాత ఆ నూనెను నొప్పి ఉన్న చోట రాసుకుంటే ఫలితం ఉంటుంది.